బిట్ కాయిన్ కు భవిష్యత్ లేనట్టేనా..?

ముంబై ,మే 2 : బిట్ కాయిన్ వ్యాల్యూ పెరిగి , మళ్ళీ కిందకు దిగొస్తున్నది. టర్కీ క్రిప్టోకరెన్సీ నిషేధం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ అంశం బిట్ కాయిన్ వంటి క్రిప్టో పైన తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గత వారం, ఈ వారం ప్రారంభంలో క్రిప్టోకరెన్సీ దారుణంగా పతనమైంది. అయితే టెస్లా, ఇతర సంస్థల నిర్ణయాలు కాస్త సానుకూలంగా ఉండటంతో బిట్ కాయిన్ తిరిగి పుంజుకుంది. రెండు రోజులుగా బిట్ కాయిన్ 54,000 డాలర్లకు పైనే కదలాడుతోంది. బిట్ కాయిన్ పక్షం రోజుల క్రితం 63వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 50వేల డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. మళ్లీ క్రమంగా పుంజుకుంతున్నది
. బిట్ కాయిన్ బ్రేకింగ్ ఔట్ అంత సులభం కాదని, గతవారం ఇలాంటి ప్రయత్నంలో విఫలమైందని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. బిట్ కాయిన్ ఇటీవలి కాలంలో క్షీణించినప్పటికీ, గత ఏడాది కాలంలో 511 శాతం ఎగిసింది. గత 12 నెలల కాలంలో ద్రవ్యోల్భణం, సెంట్రల్ బ్యాంకు పాలసీలు అతిపెద్ద డ్రైవర్లుగా ఉన్నాయి.

ఇటీవల బిట్ కాయిన్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్‌ను ఎదుర్కొంటోంది. బిట్ కాయిన్ గత వంద రోజుల్లో దాని సగటు ధర కంటే పుంజుకుంది. అయితే ఇప్పటికీ 50 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువనే ట్రేడ్ అవుతోంది. బిట్ కాయిన్ 50 రోజుల సగటును క్రాస్ చేయకుంటే 57,000 డాలర్ల వద్ద కదలాడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

