IT Act 80C | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగుస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలవ్వబోతున్నది. ఈ ఏడాదికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు తమ పన్ను మినహాయింపు కోసం క్లయిమ్ చేసుకుంటారు. పన్ను చెల్లింపు దారులకు ఆదా మార్గం.. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ఉండేది. 2013-14 వరకు ప్రతియేటా గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాత్రమే. 2014-15లో దాని పరిమితి రూ.1.5 లక్షలకు పెంచేశారు. నాటి నుంచి ఏడేండ్లుగా ఇదే పరిమితి కొనసాగుతున్నది.
2014-15 నుంచి పలు ఖర్చులు పెరిగాయి.. వేతన జీవుల వేతనాలు.. అలవెన్స్‌లు పెరిగాయి. వాటితోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కానీ ఇన్‌కం టాక్స్ యాక్ట్‌లో 80సీ సెక్షన్ కింద బెనిఫిట్ మాత్రం పెంచలేదు.