Bitcoin | క్రిప్టో మేజర్ ‘బిట్ కాయిన్’ విలువ మొదటిసారి 71 వేల డాలర్ల మార్కును దాటేసింది. కాయిన్ డెస్క్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 71,263.78 డాలర్ల వద్ద గరిస్ట రికార్డు రిజిస్టర్ చేసింది. గత 24 గంటల్లో 2.5 శాతానికి పై చిలుకు షేర్ లబ్ధి పొందడంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.40 లక్షల కోట్ల డాలర్లను దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ బిట్ కాయిన్ విలువ 67 శాతం పెరగడం ఆసక్తికర పరిణామం.
బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చినప్పటి నుంచి దీని విలువ పెరుగుతోంది. మరోవైపు, త్వరలో కీలక వడ్డీరేట్లను యూఎస్ ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తున్న సంకేతాలు కూడా బిట్ కాయిన్ పెరుగుదలకు కారణం. ఇదిలా ఉంటే బిట్ కాయిన్, ఏథీరియం ‘ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్ల)కు దరఖాస్తులు స్వీకరించాలని లండన్ స్టాక్ ఎక్చ్సేంజ్ తీసుకున్న నిర్ణయం కూడా ఈ బిట్ కాయిన్ పుంజుకోవడానికి మరో కారణం అని తెలుస్తున్నది.