Wholesale Inflation | 29 నెలల కనిష్టానికి మార్చి టోకు ద్రవ్యోల్బణం
Wholesale Inflation | మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం 29 నెలల కనిష్ట స్థాయి 1.34 శాతానికి దిగి వచ్చింది.
Wholesale Inflation | మార్చిలో హోల్సేల్ ద్రవ్యోల్బణం కాస్త కరుణించింది. దాదాపు రెండున్నరేండ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. గత మార్చి టోకు ద్రవ్యోల్బణం 1.34 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం దిగి రావడానికి ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే కారణం. వరుసగా పదో నెల హోల్సేల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలోనే నమోదవుతూ వచ్చింది. గతేడాది మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 14.63 శాతంగా నమోదైతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.85 శాతానికి పరిమితమైంది.
గత నెలలో ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం 5.48 శాతంగా నమోదైంది. గత ఫిబ్రవరిలో ఇది 3.81 శాతం మాత్రమే. గోధుమల ధర 9.16, పప్పులు 3.03 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 8.96 శాతం నమోదు కాగా, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం -0.77 శాతానికి పడిపోయింది. ఇక కూరగాయల ద్రవ్యోల్బణం సైతం -2.22 శాతం, నూనె గింజల ద్రవ్యోల్బణం 15.05 శాతంగా రికాైర్డెంది. గత నెల చిల్లర ద్రవ్యోల్బణం కూడా 15 నెలల కనిష్ట స్థాయికి చేరి 5.66 శాతం వద్ద స్థిర పడింది. గత ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా రికాైర్డెన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

