ముంబై, జూలై 11: గత నెల వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు పడిపోయాయి. జూన్‌లో 3 శాతం తగ్గినట్టు ప్రముఖ టాలెంట్ వేదిక ఫౌండిట్ తెలియజేసింది. ఐటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హోం అప్లియెన్సెస్, ఉత్పత్తి/తయారీ తదితర రంగాల్లోని కంపెనీలు కొత్త నియామకాలపై ఆచితూచి వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమన్నది.
నిరుడు జూన్‌తో పోల్చితే ఈసారి ఐటీ రంగంలో 19 శాతం, బీఎఫ్ఎస్ఐలో 13 శాతం, హోం అప్లియెన్సెస్లో 26 శాతం, ఉత్పత్తి/తయారీలో 14 శాతం రిక్రూట్మెంట్లు క్షీణించాయని ఫౌండిట్ తెలియజేసింది. కాగా, హెల్త్‌కేర్, బీపీవో, ఉత్పత్తి/తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో ఆన్లైన్ ఆధారిత రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయని స్పష్టం చేసింది.