WhatsApp – Cyber Fraud | రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ద్వారా జరిగే మోసాలకు పరిమితుల్లేకుండా పోయాయి. యూజర్లు ఎంత అలర్ట్గా ఉన్నా సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. బ్యాంకు కేవైసీ వివరాల పేరుతో మొదలు పెట్టి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ప్రేరేపించి.. అటుపై అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి మనీ దోచుకెళ్తున్నారు. కనుక ఇటువంటి మోసగాళ్ల మాయలో పడకుండా ఉండాలంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు.
లాటరీ తగలిందని.. ఫ్రీ లోన్ ఇస్తామని.. అందుకు పర్సనల్ డిటైల్స్ సేకరించడానికి సైబర్ మోసగాళ్లు ఎత్తు వేస్తారు. ఇటువంటి సందేశాలు రాగానే నిజానిజాలు తెలుసుకోకుండా.. సదరు కంపెనీ వారు అడుగుతున్నారా.. బ్యాంకు అధికారులు ఎంక్వయిరీ చేశారా? అన్న సంగతి తెలియకుండా ప్రతిస్పందించవద్దని అంటున్నారు.
గిఫ్ట్స్, డిస్కౌంట్స్ అనే పేరుతో లింకులు పంపుతారు. దాంతోపాటు గంటలోపే మీ పర్సనల్ డిటైల్స్ తెలుపాలని కోరతారు. అలా వచ్చిన లింక్ ల మీద క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా వారికి చిక్కినట్లే.. అలాగే జాబ్ ఆఫర్లు, ఇన్వెస్ట్ మెంట్ ఆఫర్లు అంటూ నకిలీ ఖాతాల నుంచి సమాచారం సేకరిస్తారు.. ఇటువంటి వారి భారీన పడకుండా ఉండాలంటే ఆగంతకుల నుంచి వచ్చే సందేశాలను చెక్ చేసుకున్నాకే సంప్రదింపులు జరుపాలి. కనుక సైబర్ మోసగాళ్ల ఆటలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ యూజర్లు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడంతో ఫ్రాడ్ స్టర్స్కు మీ ఫోన్ నంబర్ తెలిసినా.. మీ బ్యాంకు ఖాతా వివరాలు పొందకుండా అడ్డుకునేందుకు ఉపకరిస్తుంది.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!