WhatsApp | మెటా అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవలే వీడియో కాల్ ద్వారా స్క్రీన్ షేరింగ్ ఫెసిలిటీ కల్పించిన వాట్సాప్.. త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఓ సదుపాయం అందుబాటులోకి తేనున్నది.
ఏఐ సాయంతో వాట్సాప్ లోనే తేలిగ్గా స్టిక్కర్లు తయారు చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ పీచర్ సాయంతో ఏఐను ఉపయోగించుకుని అప్పటికప్పుడు వాట్సాప్లో మనకు అవసరమైన సొంత స్టిక్కర్ రెడీ చేసుకోవచ్చు. అయితే, అందుకు అవసరమైన కమాండ్స్ ఇవ్వాలి.
సందర్భానుసారంగా రూపొందించే స్టిక్కర్లు మీరు పంపే వ్యక్తికి తేలిగ్గానే అర్థం అవుతాయి. స్టిక్కర్ ప్యాలెట్లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీ సపోర్ట్ మెటా అందిస్తుంది. అయితే, వాట్సాప్ ఏ ‘ఏఐ’ మోడల్ వాడుతుందనే సంగతి తెలియరాలేదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న స్టిక్కర్ ఫీచర్ త్వరలోనూ వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.