న్యూఢిల్లీ : వాట్సాప్ పేతో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ డిజిటల్ చెల్లింపుల సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యూజర్లను పెంచుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లకు వాట్సాప్ పే క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. మీరు ఇంకా వాట్సాప్ పే ఖాతాను ఓపెన్ చేయని పక్షంలో ఈ వివరాలతో సులభంగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
మొదటిగా వాట్సాప్ అకౌంట్లోకి వెళ్లి పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. లిస్ట్ నుంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పేరు వంటి బ్యాంకు అకౌంట్ వివరాలను పొందుపరచాలి. ఇక వాట్సాప్ పేలో బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేసేందుకు సెట్టింగ్స్ మెనూకు వెళ్లి, పేమెంట్స్ సెక్షన్లో యాడ్ పేమెంట్ మెధడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆపై కంటిన్యూ బటన్‌ను క్లిక్ చేసి యాక్సెప్ట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
తర్వాత వాట్సాప్ పే ప్రైవసీ పాలసీ, టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేయాలి. ఆపై బ్యాంకుల లిస్ట్ నుంచి మీ బ్యాంకును ఎంచుకుని, వెరిఫై వయా ఎస్ఎంఎస్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. మీ అకౌంట్‌ను వెరిఫై చేసి మీరు యాడ్ చేయాలనుకునే బ్యాంక్ అకౌంట్‌ను అమౌంట్ పంపేందుకు, రిసీవ్ చేసుకునేందుకు క్లిక్ చేయాలి. ఆపై పేమెంట్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి స్క్రీన్‌పై చూపించే ఇన్స్ట్రక్షన్స్ను అనుసరించాలి.