WhatsApp Reactions Feature | మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎట్టకేలకు రియాక్షన్స్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనున్నది. వాట్సాప్ రియాక్షన్స్ ఫీచర్ కోసం యూజర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. మెటాస్ (ఫార్మర్లీ ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ అంశాన్ని ధృవీకరించారు. ఇటీవలే వాట్సాప్ తాను విడుదల చేయబోతున్న న్యూ ఫీచర్ల జాబితాను వెల్లడించింది. ఇప్పటి వరకు వాట్సాప్ అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఇప్పటికే రియాక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో రియాక్షన్ ఫీచర్ రావడం కొద్ది ఆలస్యం.
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన పోస్ట్ ప్రకారం తొలుత యూజర్లు రియాక్షన్ మెసేజ్ పంపడానికి ఆరు ఏమోజీలు పొందొచ్చు. లైక్, లవ్, లాప్, సర్ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ ఎమోజీలు వాటిలో ఉన్నాయి. అన్ని రకాల ఏమోజీలు వాడేందుకు భవిష్యత్‌లో అవకాశం రావొచ్చు. వాటిలో కొన్ని బేటా టెస్టింగ్‌కు వినియోగిస్తున్నారు. దీనికి అదనంగా యాప్‌లోని జిఫ్ట్స్, స్టిక్కర్స్ కూడా యూజర్లు వాడొచ్చు.
మీరు ఏదేని వాట్సాప్ యూజర్ నుంచి వచ్చిన మెసేజ్‌కు రియాక్షన్ తెలుపాలనుకుంటే ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అటుపై మీకు వచ్చిన మెసేజీల్లో రియాక్ట్ కావాలనుకున్న మెసేజ్‌పై ప్రెస్ చేసి హోల్డ్‌లో ఉంచాలి. తర్వాత ఆరు రియాక్షన్ ఏమోజీల్లో మీకు వచ్చిన మెసేజ్‌కు అనుగుణంగా ఉన్న ఎమోజీని ఎంపిక చేసుకుని పాప్అప్ మెనూలో చేర్చాలి.