WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్ల సౌలభ్యం కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తున్నది. తాజాగా పీసీ విండోస్ యూజర్లు తమ టెక్ట్స్ సైజ్ అడ్జస్ట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ తెస్తున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ విండోస్ బేటా వాట్సాప్ అప్డేట్ అందుబాటులో ఉందని వాబీటా ఇన్ఫో (WABetaInfo) చెబుతున్నది. ఈ ఫీచర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాట్సాప్ యూజర్లు యాప్ సెట్టింగ్స్’లో పర్సనలైజేషన్ (Personalisation) మెనూలోకి వెళ్లి టెక్ట్స్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ న్యూ ఫీచర్‌తో విండోస్ యాప్‌లో యూజర్లు తేలిగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూజర్లు కంట్రోల్ + /- 0 కీలను వాడి టెక్ట్స్ సైజ్ రీసెట్ చేసుకోవచ్చు. టెక్ట్స్ సైజ్ పెంచుకోవడం వల్ల యూజర్లు తమ మెసేజ్‌లు తేలిగ్గా చదవచ్చు. టెక్ట్స్ సైజ్ తగ్గించడం తమకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కొందరు బీటా యూజర్లకు మాత్రమే టెక్ట్స్ అడ్జస్టబుల్ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తారని సమాచారం.
ఒకేసారి 32 మంది వీడియో కాల్స్ చేసుకునేందుకు గతవారం వాట్సాప్ కొత్త ఫీచర్ అమల్లోకి తెచ్చింది. మున్ముందు ఈజీగా చాట్లు వెతుక్కోవడానికి చాట్ ఫిల్టర్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. అన్‌రీడ్ మెసేజ్‌లు, పర్సనల్ చాటింగ్, బిజినెస్ చాటింగ్ తదితర విభాగాలుగా చాట్ ఫిల్టర్ ఫీచర్ రూపొందిస్తున్నది.