హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : సిల్ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిషరణ కేంద్రంగా ఉన్న టీ హబ్, టీ వర్స్ లాంటి సంస్థల ను బహ్రెయిన్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశ రాయబారికి హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన బహ్రెయిన్ రాయబారి అబ్దుల్ రహమాన్ అల్ గావుద్, బహ్రెయిన్ ఛాం బర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం సహకరిస్తే ఆ రెండు సంస్థలలాంటివి తమ దేశంలో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు బహ్రెయిన్ ప్రతినిధుల బృందం మంత్రిని కోరింది. తాము ఏర్పాటు చేసిన సిల్ యూనివర్సిటీని పరిశ్రమలే నిర్వహించి తమకు అవసరమైన నైపుణ్యంలో యువతకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు శ్రీధర్ బాబు వారికి తెలిపారు.