హైదరాబాద్, జూన్ 9: వే2న్యూస్ యాప్.. సీరిస్ ఏ ఫండింగ్‌లో భాగంగా 16.75 మిలియన్ డాలర్ల(రూ.130 కోట్లకుపైగా) నిధులను సేకరించింది. వెస్ట్బ్రిడ్జి క్యాపిటల్, వెంచర్ క్యాపిటలిస్ట్ శశి రెడ్డిల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిధులను వ్యాపార విస్తరణ కోసం, ఎడిటోరియల్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి, ఏఐ ఆధారంగా న్యూస్ అందించడానికి వెచ్చించనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో రాజు తెలిపారు.