ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు.. అధిక వడ్డీరేట్ల ఆఫర్!!
ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు.. అధిక వడ్డీరేట్ల ఆఫర్!!| వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లు....

న్యూఢిల్లీ: వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లు సాధారణంగా తక్కువ. కానీ కొన్ని చిన్న, నూతన ప్రైవేట్ బ్యాంకులు మాత్రం సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై మెరుగైన వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5-5.5 శాతం వడ్డీరేట్లు ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల టెన్యూర్‌పై సాధారణ ప్రజలు ఆధారపడి డిపాజిట్లు చేస్తారు. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి.
కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికీ తమ పొదుపు ఖాతాలపై 3-7.25 శాతం వడ్డీ ఇస్తున్నాయి. సగటున పొదుపు ఖాతాల్లో నిర్దిష్ట మొత్తం బ్యాలెన్స్ కొనసాగిస్తూ ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై కంటే సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపైనే వడ్డీ అందిస్తున్నాయి.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జివాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వంటి బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7% వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం మీద ఐటీ చట్టంలోని 80టీటీఏ సెక్షన్ కింద పన్ను రాయితీ లభిస్తుంది.
ఒకవేళ, మీరు భారీ మొత్తంలో పొదుపు చేయాలని భావిస్తున్నారా.. అయితే కొన్ని ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటి మూడు బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీరేట్లు లభిస్తాయి. ఆయా బ్యాంకులిచ్చే వడ్డీరేట్లపై ఓ లుకేద్దాం..
ఆర్బీఎల్లో 4.5-6.25% వడ్డీ
ఆర్బీఎల్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు అధిక వడ్డీరేట్ ఆఫర్ చేస్తున్నది. ఆ బ్యాంక్ వెబ్సైట్ rblbank.comలో తెలిపిన వివరాల మేరకు తన ఖాతాదారులకు 4.5 నుంచి 6.25 శాతం వడ్డీ అందిస్తున్నది.
బంధన్ బ్యాంకులో ఇలా
బంధన్ బ్యాంకు తమ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు 3-6 శాతం వడ్డీ అందిస్తున్నది. అయితే, అది రోజువారీగా సదరు ఖాతాలో బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంది.
యెస్ బ్యాంక్‌లో 5.5 శాతం వరకు వడ్డీ
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపై 4-55 శాతం వడ్డీ అంద చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

