న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్ ఇండియా కూడా తన మోడళ్ళ ధరలను పెంచింది. ఉత్పత్తి వ్యయం అధికమవడంతో కార్ల ధరలను రూ.1 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచినట్లు మంగళవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని తెలిపింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్సీ 40 ధర 3 శాతం అధికమవడంతో రూ.44.50 లక్షలకు చేరుకోగా, ఎక్స్సీ 60 మోడల్ 4 శాతం పెంచడంతో ధర రూ.65.90 లక్షలకు, ఎస్90ని రెండు శాతం సవరించడంతో రూ.65.90 లక్షలకు, ఎక్స్సీ90ని 3 శాతం అధికమవడంతో రేటు రూ.93.90 లక్షలకు చేరుకున్నది. ఈ నెల 12 వరకు బుకింగ్ చేసుకున్న వారికి ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది సంస్థ.