Vodafone CEO : ట్విట్టర్, వాట్సాస్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు. ఈమధ్య పెద్ద స్థాయిలో ఉన్న కొందరు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోను వీడారు. ఇప్పుడు టెలికాం రంగంలోనూ రాజీనామాలు మొదలయ్యాయి. వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ ఈ ఏడాది కంపెనీకి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ ఏడాది చివరికల్లా ఆయన రాజీనామా చేస్తారని సోమవారం వొడాఫోన్ తెలిపింది. ఇదే విషయాన్ని నిక్ కూడా ధ్రువీకరించాడుz. ‘కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం అనే విషయమై నేను బోర్డు సభ్యులతో అంగీకరించాను ‘ అని నిక్ రీడ్ ఒక ప్రకటనలో తెలిపాడు. దాంతో, ప్రస్తుతం చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ( సీఎఫ్ఓ)గా ఉన్న మార్గరేట డెల్లా వల్లె తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నాడు.
నిక్ రీడ్ 2018లో వొడాఫోన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. కరోనా సమయంలో కంపెనీని సమర్థంగా నడిపించడమే కాకుండా యూరప్, ఆఫ్రికా దేశాల్లో వొడాఫోన్ మార్కెట్ విస్తరించడంలో నిక్ కృషి ఎంతో ఉంది. సీఈవోగా తప్పుకున్నాకూడా అతను వొడాఫోన్తో కొనసాగనున్నాడు. 2023 మర్చి వరకు సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 2001లో వొడాఫోన్‌లో చేరిన నిక్ ప్రాంతీయ, గ్లోబల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు.