Vivo Y58 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు రంగుల్లో లభించే వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 (Qualcomm Snapdragon 4 Gen 2 SoC) ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తున్నది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌లో ఐపీ 64 రేటింగ్ కలిగి ఉంది.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,499లకు లభిస్తుంది. హిమాలయన్ బ్లూ, సుందర్ బాన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఎస్బీఐ కార్డు, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకూ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1024 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2408 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 2.5డీ స్క్రీన్- టీయూవీ లో బ్లూ లైట్ ఐ కేర్ సర్టిఫికెట్, 4ఎన్ఎం క్వాల్కామ్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఇన్ బిల్ట్ మెమొరీ ఒక టిగా బైట్స్ వరకూ పెంచుకోవచ్చు.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చర్, ఎఫ్/2.4 అపెర్చర్ తోపాటు 2 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. జీపీఎస్, బైదూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, మోటార్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఐఆర్ కంట్రోల్, గైరో స్కోప్ వంటి సెన్సర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేసన్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.
44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ వస్తోంది. సింగిల్ చార్జింగ్ తో బ్యాటరీ 73 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, 23 గంటలు యూ-ట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ టైం బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేవలం ఐదు నిమిషాలు చార్జింగ్ చేస్తే 2.8 గంటల పాటు టాక్ టైం లభిస్తుంది.