Vivo Y36 4G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. త్వరలో భారత్ మార్కెట్లో తన వివో వై36 4జీ ఫోన్ (Vivo Y36 4G) ఆవిష్కరించనున్నది. గత నెలలో ఇండోనేషియా మార్కెట్లో ఎంటరైనా వివో వై36 4జీ ఫోన్.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది. డ్యుయల్ రేర్ కెమెరా, సింగిల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. మూడు రంగుల్లో వస్తున్న వివో వై36 4జీ (Vivo Y36 4G) ఫోన్ సింగిల్ వేరియంట్లోనే భారత్ మార్కెట్లోకి వస్తున్నట్లు సమాచారం.
8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ.18,700 ఉండొచ్చునని అంచనా. గ్లిట్టర్ ఆక్వా, మీటర్ బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని తెలుస్తున్నది. అయితే భారత్ మార్కెట్లో ఎంత ధర నిర్ణయించాలన్నది తెలియరాలేదు.
త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న వివో వై36 4జీ (Vivo Y36 4G) ఫోన్ 6.64 -అంగుళాల ఫుల్ హెచ్డీ (2400×1080 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 విత్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
వివో వై36 4జీ (Vivo Y36 4G) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ ఉంటుంది. ఈ ఫోన్ 15 నిమిషాల్లో 30 శాతం చార్జింగ్ అవుతుంది. ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ వీ 5.1, వై-ఫై కనెక్టివిటీ ఉంటుందని తెలుస్తున్నది.