Vivo Y29 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై29 5జీ (Vivo Y29 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 44వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ‘మిలిటరీ గ్రేడ్’ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. దేశంలో నాలుగు ర్యామ్- స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. వివో వై29 5జీ (Vivo Y29 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999లకు లభిస్తుంది. ఎస్బీఐ కార్డు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. రూ.1399తో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు వీ-షీల్డ్ డివైజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. డైమండ్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో లభిస్తుందీ ఫోన్. వివో ఇండియా వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
వివో వై29 5జీ (Vivo Y29 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.68 అంగుళాల హెచ్డీ (720×1608 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్ నెస్, 264 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. 6 ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ర్యామ్ ను బట్టి వర్చువల్ గా అదనంగా 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు.
వివో వై29 5జీ (Vivo Y29 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. డైనమిక్ లైటింగ్‌కు మద్దతుగా రింగ్ వంటి ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటాయి. 44 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్. 79 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 5జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎం, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, అంబియెంట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి.