Vivo Y200 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై200 5జీ (Vivo Y200 5G) ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నదని సమాచారం. గత ఫిబ్రవరిలో మార్కెట్లో రిలీజ్ చేసిన వివో వై100 కొనసాగింపుగా వివో వై200 5జీ ఫోన్ వస్తోంది. 6.67- అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుందని సమాచారం. 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. ఈ నెలాఖరులోగా వివో వై200 5జీ ఫోన్ మార్కెట్లోకి రానున్నదని వినికిడి.
భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.24 వేల లోపే ఉండొచ్చునని చెబుతున్నారు. ఓఐఎస్ మద్దతుతో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేసే అవకాశం ఉంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుందని చెబుతున్నారు.