Vivo X90 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో వచ్చే వారం తన ప్రీమియం మోడల్.. వివో ఎక్స్ 90 (Vivo X90) ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. త్రీ రామ్ అండ్ స్టోరేజీ వేరియంట్లలో లభించవచ్చునన తెలుస్తున్నది. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ల్లో రానున్నదని సమాచారం. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ తయారీని వివో నిలిపేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 26న వివో ఎక్స్90 ఫోన్ చైనా మార్కెట్లోకి రావచ్చు.
అన్ని రకాల వివో ఎక్స్ 90 (Vivo X90) వేరియంట్లు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్లో లభిస్తాయి. వివో ఎక్స్90 ఫోన్ నాలుగు కలర్స్ -బ్లాక్, రెడ్, వైట్, రీఫ్రెష్డ్ గ్రీన్ షేడ్ రంగుల్లో లభిస్తుంది. న్యూ మీడియా టెక్ డైమెన్సిటీ 9200 + ఎస్వోసీ చిప్ సెట్ వస్తుందని సమాచారం. అంతే కాదు వైట్ కలర్ వేరియంట్ జైస్ (Zeiss) బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరాస్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్లో వస్తాయని వివిధ వెబ్ సైట్లలో వార్తా కథనాల సారాంశం.
వివో ఎక్స్ 90 (Vivo X90) ఫోన్ 6.78 అంగుళాల కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్ (2800×1280 పిక్సెల్స్)తో వస్తున్నది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. అథంటికేషన్ కోసం అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వస్తుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌లో 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 12-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ సెన్స్ విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్ కెమెరా ఉంటాయి. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.59,900 నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తున్నది.