Vivo X100 Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్100 ((Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్సెట్తో పని చేస్తాయి. ఇమేజ్ ప్రాసెసింగ్లో వివో ఇన్ హౌస్ ఇమేజింగ్ చిప్తోపాటు జీస్ కో-ఇంజినీర్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. వివో ఎక్స్100 ప్రో ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 989 1-అంగుళం టైప్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తున్నాయి. రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు తో కర్వ్డ్ 6.78-అంగుళాల 8 ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. వివో ఎక్స్100 ఫోన్ 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, వివో ఎక్స్100 ప్రో ఫోన్ 100 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు ఫోన్లూ చైనా, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో లభిస్తాయి.
వివో ఎక్స్100 ప్రో ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.89,999 పలుకుతుంది. ఆస్ట్రయిడ్ బ్లాక్ షేర్ కలర్ లో లభిస్తుంది. వివో ఎక్స్100 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.63,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.69,999లకు లభిస్తాయి. వివో ఎక్స్100 ఫోన్ ఆస్ట్రయిడ్ బ్లాక్, స్టార్ గేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందొచ్చు.
ఈ నెల 11 నుంచి రెండు ఫోన్ల ప్రీ-బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్, ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి 10 శాతం క్యాష్ బ్యాక్, రూ.8000 వరకూ బోనస్ పొందొచ్చు.
వివో ఎక్స్100 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 6.78 అంగుళాల (1260 x2800 పిక్సెల్స్) అమోలెడ్ 8టీ ఎల్టీపీఓ కర్వ్డ్ డిస్ ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 2160 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్, వివో న్యూ వీ3 ఇమేజింగ్ చిప్ కలిగి ఉంటుంది.
వివో ఎక్స్100 ప్రో ఫోన్లో జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్989 1-అంగుళం టైప్ సెన్స్ విత్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగా పిక్సెల్ జీస్ ఏపీఓ సూపర్ టెలిఫోటో కెమెరా విత్ ఓఐఎస్ ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో చాట్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి.
ఈ ఫోన్ 5జీ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, నావిక్ సీ, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలరో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, గైరో స్కోప్, ఇన్ ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
వివో ఎక్స్ 100 ఫోన్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్ 920 వీసీఎస్ బయోనిక్ మెయిన్ కెమెరా విత్ ఓఐఎస్, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగా పిక్సెల్ జీస్ సూపర్ టెలిఫొటో కెమెరా విత్ 100 ఎక్స్ క్లియర్ జూమ్, 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.