Vivo V50 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో 50 (Vivo V50) ఫోన్‌ను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది నవంబర్ నెలలో వివో ఎస్20 (Vivo S20) పేరుతో మార్కెట్లో ఆవిష్కరించింది. వివో 50 (Vivo V50) ఫోన్ ఈ నెల 17 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని వివో తన ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ల ద్వారా విక్రయించనున్నారు. రోజ్ రెడ్, స్టారీ బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుందని వివో ధృవీకరించింది.
వివో 50 (Vivo V50) ఫోన్ సర్కిల్ టూ సెర్చ్ (Circle to Search), ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ (Transcript Assist), లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ (Live Call Translation) తోపాటు ఏఐ బ్యాక్డ్ ఫోటో ఇమేజింగ్ (AI-backed Photo Imaging), ఎరేజ్ 2.0 (Erase 2.0), లైట్ పోర్ట్రైట్ 2.0 (Light Portrait 2.0) వంటి ఏఐ ఎడిటింగ్ ఫీచర్లు ఉంటాయి.
వివో వీ50 (Vivo V50) ఫోన్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందని ధృవీకరించింది వివో. ఈ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, ఔరా లైట్ ఫీచర్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ -15 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 15 (Android-15 Based Funtouch OS 15) వర్షన్‌పై పని చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంది. 12జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా ఉంటుంది. వర్చువల్‌గా 12 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
Vivo V50 Is Launching In India On 17th February 2025#VivoV50 #Vivo pic.twitter.com/bvAmqDIYeu
— Sufiyan Technology (@RealSufiyanKhan) February 7, 2025