Vivo V29 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo).. తన వివో వీ29 సిరీస్ ఫోన్లు – వివో వీ29 (Vivo V29 5G), వివో వీ29 ప్రో 5జీ (Vivo V29 Pro 5G) త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు ఫోన్లూ 1.5 కే రిజొల్యూషన్తో 3డీ కర్వ్డ్ అండ్ 6.78-అంగుళాల అమోలెడ్ డిష్ ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. అలాగే 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. గత జూలైలో ఈయూ మార్కెట్లో ఆవిష్కరించిన వివో వీ29 సిరీస్ ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 778జీ ఎస్వోసీ చిప్సెట్ ఉంది.
మేజిస్టిక్ రెడ్, హిమాలయన్ బ్లూ, పర్పుల్ ఫెరీ, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లు, త్రీ ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్లు – 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తు్న్నాయని తెలుస్తున్నది.
గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన వివో వీ29 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్-13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్- 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భారత్ మార్కెట్లోని ఇవే ఫీచర్లు లభిస్తాయని తెలుస్తున్నది.
వివో వీ29 5జీ ఫోన్ వై-ఫై, బ్లూటూత్-5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, నేవీ సీ, ఓటీజీ, జీపీఎస్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలోమీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్ కెమెరా, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉంటాయి. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.