Vivo T4 Ultra | చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో తన టీ4 సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే T4, T4x 5G స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ వివో టీ4 అల్ట్రా 5జీ పేరుతో (Vivo T4 Ultra) యూజర్లకు పరిచయం చేసింది. 50 ఎంపీ కెమెరా, 5500 mAh బ్యాటరీతో బడ్జెట్ ధరలో అందిచనుంది. దీనిని జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
వివో నుంచి వస్తున్న ఈ కొత్త ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల (16.94 సెంటీమీటర్లు) pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ 9300+ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 పై రన్ అయ్యే ఈ ఫోన్లో LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ కెమెరా, 50ఎంపీ 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ల్ఫీ ప్రియుల కోసం, ఈ ఫోన్లో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ ఉండనుంది.
అధికారికంగా ఇంకా వెల్లడించనప్పటికీ.. భారతదేశంలో వివో T4 అల్ట్రా 5G ధర దాదాపు రూ. 35 వేల లోపు ఉంటుందని తెలుస్తున్నది. గతంలో వివో T3 అల్ట్రా 5G మోడల్‌ను కూడా రూ.31,999కి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఈ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో (ఆఫ్‌లైన్‌లో) అందుబాటులో ఉన్నది.