Vivo T3 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ వివో (Vivo) తన వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ వచ్చే వారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఆరెంజ్ షేడ్ కలర్ ఆప్షన్ లో అందుబాటులోకి వస్తున్న వివో టీ3 ప్రో 5జీ ఫోన్ రూ.25 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుంది.
వివో టీ3 ప్రో 5జీ ఫోన్ ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. వివో ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆవిష్కరిస్తారు. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. హోల్ పంచ్ డిజైన్ తో వస్తున్న స్క్రీన్ ‘ఐ ప్రొటెక్షన్’ కల్పిస్తుంది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తోంది వివో టీ3 ప్రో 5జీ. 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా తోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంటుంది.