Vivo T1 | భారతీయ స్మార్ట్ ఫోన్ కస్టమర్లను ఆకర్షించేందుకు చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ వివో ఇండియా దూకుడుగా ముందుకెళ్తున్నది. ఇప్పటికే వీవో వీ 25 మోడల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిన వివో.. తాజాగా `వివో టీ1` 5జీ వేరియంట్‌ను ఆవిష్కరించింది. సిల్కీ వైట్తోపాటు మూడు రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. రెయిన్బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్, సిల్కీ వైట్ కలర్స్‌లో వివో టీ1 లభ్యం అవుతుంది. మధ్యతరగతి యూజర్ల బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రానున్నది. మూడు వేరియంట్లలో పొందొచ్చు. 8జీబీ రామ్ సామర్థ్యం గల వేరియంట్లో మరో 4జీబీ రామ్ సామర్థ్యం పెంచడానికి ఎక్స్టెండెడ్ రామ్ 2.0 టెక్నాలజీ కూడా ఇందులో అనుమతిస్తారు. రూ.15,990 నుంచి రూ.19,990 మధ్య వివో టీ1 ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వివో టీ1 వస్తోంది. ఈ ఫోన్లో 1080 X 2408 పిక్సెల్ రిజొల్యూషన్ వీడియోలు కూడా వీక్షించొచ్చు. 50 మెగా పిక్సెల్ (ఎంపీ), 2 ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా, రేర్ ఫ్లాష్‌తోపాటు 16 ఎంపీల సెల్ఫీ కెమెరా జత చేశారు.
వివో టీ1 ఫోన్ 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.15,990, 6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ రూ.16,990, 8 జీబీ రామ్ ప్లస్ 128 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.19,990లకు కొనుగోలు చేయొచ్చు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల వీవో టీ1 ఫోన్లో బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోయినా 102 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేయొచ్చు. 18 వాట్ల చార్జర్‌తో ఫాస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చు. ఓటీజీ కేబుల్ సాయంతో రివర్స్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫుల్ చార్జింగ్ తర్వాత 19 గంటల పాటు యూ-ట్యూబ్ స్ట్రీమింగ్, 25 గంటల పాటు కైండిల్, 7.6 గంటల పాటు గేమింగ్ ప్లేబ్యాక్ పొందొచ్చు.