Vivo Y36 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి వివో వై-సిరీస్ ఫోన్ `వివో వై36 (Vivo Y36)’ ఫోన్ ఆవిష్కరించింది. రెండు కలర్ ఆప్షన్లలో 2.5డీ కర్వ్డ్ గ్లాస్ బాడీతో వివో వై36 వస్తున్నది. స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్సెట్తో అందుబాటులోకి వచ్చింది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ుంటుంది.
వివో వై 36 (Vivo Y36) 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ఫోన్ మీటర్ బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డుపై ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి ఫ్లిప్‌కార్ట్ రూ.1,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నది. ఈఎంఐ ఆప్షన్లలో కొనుగోలు చేసినా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్బీఐ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కొనుగోలు చేసినా అదనంగా రూ.500 ధర తగ్గిస్తారు.
డ్యుయల్ సిమ్ ఆప్షన్ గల వివో వై36 ఫోన్ ఆండ్రాయిడ్ విత్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.64 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2388 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది.
వివో వై36 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.8 లెన్స్, 2-మెగా పిక్సెల్ బోకెహ్ షూటర్, ఫ్రంట్‌లో 16-మెగా పిక్సెల్స్ సెల్ఫీ షూటర్ విత్ ఎఫ్/2.0 అపెర్చర్ కెమెరా ఉంటాయి. సూపర్ నైట్ మోడ్, మల్టీ స్టైల్ పొర్ట్రైట్, బొకెహ్ ఫ్లేర్ పొర్ట్రైట్ తదిత మోడ్స్‌లో ఫొటోలు తీయడానికి అనుకూలంగా కెమెరాలు ఉంటాయి.
128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్స్ వరకు విస్తరించవచ్చు. వివో వై36 ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ /ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సిలోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, గైరో స్కోప్ వంటి సెన్సర్లు ఉంటాయి. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.