Vistara | విస్తారా ఎయిర్‌లైన్స్‌కు షాక్ ఇచ్చిన డీజీసీఏ..!
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీసీఏ షాకిచ్చింది.
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీసీఏ షాకిచ్చింది. పైలట్ల శిక్షణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నోటీసు జారీ చేసింది. కంపెనీ పైలట్ శిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది. పైలట్లకు శిక్షణ ఇచ్చే ప్రక్రియలో జీరో ఫ్లైట్ టైమ్ ట్రైనింగ్ (ZFTT)లో భాగంగా పైలట్లు వివిధ రకాల విమానాలను నడపడానికి శిక్షణ పొందుతారు. ఇందులో పైలట్లు అనేక దశల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
అయితే, ఈ ప్రక్రియలపై డీజీసీఏ ప్రశ్నలు లేవనెత్తింది. జీరో ఫ్లైట్ టైమ్ ట్రైనింగ్‌లో భాగంగా విస్తారా పైలట్లు బోయింగ్ 787 విమానాలను నడపాల్సి ఉంది. అయితే, నిబంధనలను ఉల్లంఘించినందుకు నోటీసుల నేపథ్యంలో శిక్షణ తాత్కాలికంగా నిలిచిపోయింది. పైలట్లు అప్పటికే ఎయిర్‌బస్ ఏ320 విమానాలను నడుపుతున్నారు. శిక్షణలో భాగంగా బోయింగ్ 787 విమానాలను నడపాల్సి వచ్చింది. విస్తారా యూరోపియన్ రూట్లలో బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన ఏవియేషన్ కంపెనీ ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో డీజీసీఏ నోటీసు ఇచ్చింది. ఈ వారం మొదటి మూడు రోజుల్లో విస్తారా 150కిపైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- DGCA
- notice
- Telugu News
- Vistara
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

