హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సీఈవోగా నియమితులైన ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ ఎమ్మారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు