Vodafone Idea | మొబైల్ ప్రీపెయిడ్ యూజర్లలో అత్యధికులు నెలవారీ రీచార్జీ చేసుకుంటే, మరి కొందరు ఏడాది మొత్తం ఒకేసారి రీచార్జి చేసుకుంటారు. అటువంటి వారి కోసం వొడాఫోన్ ఐడియా (వీఐ) కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ తెచ్చింది. వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.3,199తో రీ చార్జి చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2 జీబీ చొప్పున ఏడా 730 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ మొబైల్ వర్షన్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అపరిమిత డేటా ఫ్రీగా లభిస్తుంది. వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఫీచర్‌తో వారం రోజులు ఉపయోగించని డేటా వారాంతంలో వాడొచ్చు. వొడాఫోన్ ఐడియా (వీఐ) మూవీస్, వొడాఫోన్ ఐడియా (వీఐ) టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. వొడాఫోన్ ఐడియా మాదిరిగానే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఇదే తరహా ప్రీ పెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. రూ.4,498తో జియో వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్, భారతీ ఎయిర్ టెల్ తో రూ.3,359తో ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి.