న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వాహన విక్రయా లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. జీఎస్టీని హేతుబద్దీకరించనుండటంతో ధరలు తగ్గుతాయన్న అంచనాతో కొనుగోలుదారులు వెనుకంజ వేశారు. దీంతో ఆగస్టు నెలలో వాహన విక్రయాలకు బ్రేక్‌పడింది.
వాహన దిగ్గజ సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటర్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో మారుతి అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 8 శాతం తగ్గగా, హ్యుందాయ్ సేల్స్ 4 శాతం, మహీం ద్రా ఒక్కశాతం తగ్గుముఖం పట్టాయి.