బంజారాహిల్స్, అక్టోబర్ 10: వారాహి సిల్క్స్ హైదరాబాద్లో షోరూంను ప్రారంభించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతులమీదుగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వారాహి సిల్క్స్ అటు సాంప్రదాయ వస్ర్తాలకు, ఇటు ఫ్యాషన్ వస్ర్తాలకు వారధిగా నిలుస్తున్నదన్నారు. గుంటూరులో 1969 నుంచి సేవలు అందిస్తున్న కన్యకాపరమేశ్వరి సిల్క్స్టోర్ 55 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రజలకు సరికొత్త పట్టు వస్ర్తాలను అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో సరికొత్త సిల్క్స్ షోరూంను ఏర్పాటు చేశామని సంస్థ నిర్వాహకులు యేచూరి మణిదీప్, డా. స్పందన తెలిపారు. షోరూం ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.25 వేల కొనుగోలుపై అరగ్రాము గోల్డ్ కాయిన్, రూ. 50 వేల కొనుగోలు మీద ఒక గ్రాము బంగారం, రూ. 1 లక్ష కొనుగోలు మీద 2గ్రాముల బంగారు కాయిన్ అందిస్తామని వివరించారు. దీంతోపాటు రూ.50 వేలకు పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి వారికి రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల విలువైన అన్కట్ డైమండ్ నెక్లెస్ను గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 30 వరకు మాత్రమే అమలులో ఉంటాయని వెల్లడించింది.