US Garmin company: గర్మిన్ కంపెనీ ఇండియా యూనిట్ హెడ్‌గా ఏసుదాస్ పిళ్లై
అమెరికాకు చెందిన గర్మిన్ కంపెనీ ఇండియా యూనిట్ కొత్త హెడ్ ఇతనే
అమెరికాకు చెందిన స్వార్ట్ వాచీ కంపెనీ గర్మిన్ ఇండియా యూనిట్ హెడ్‌గా ఏసుదాస్ పిళ్లైని నియమించింది. ఢిల్లీ, బెంగళూరు, పూనేలో గరిమ స్టోర్లు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ ఏడాది త్రైమాసికంలో గర్మిన్ స్మార్ట్‌వాచ్‌ల కొనుగోళ్లు 34 శాతం పెరిగాయి. వీటిలో గర్మిన్ వెనూ సిరీస్ వాచీలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దాంతో, మనదేశంలో మరిన్ని ప్రాంతాలకు తమ కంపెనీ ఉత్పత్తులను తీసుకెళ్లాలి అనుకుంటోంది గర్మిన్ యాజమాన్యం. అంతేకాదు వచ్చే ఏడాది కల్లా మనదేశంలోకి ఏడు కొత్త బ్రాండ్ స్టోర్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఈ స్టోర్లు సర్వీస్ కలెక్షన్ పాయింట్స్‌గా పనిచేస్తాయని చెప్తున్నారు గర్మిన్ ప్రతినిధులు. యాపిల్, గూగుల్, వన్‌ప్లస్ వంటి కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి స్మార్ట్‌వాచీలను తెచ్చాయి.
కొత్త టెక్నాలజీని నమ్ముతా
‘మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీ ఉండాలని నేను నమ్ముతాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్మిన్ టీంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. మనదేశంలో గర్మిన్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేందుకు, కంపెనీ విస్తరించేందుకు అన్నివిధాలా కృషి చేస్తాను. 2023 వరకు పది గర్మిన్ ప్రొడక్ట్స్‌ని మనదేశంలో తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తాను’ అని చెప్పాడు ఏసుదాస్ పిళ్లై.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

