US Interest Rates | స్ట్రాంగ్ ఎకానమీ కోసం వడ్డీరేట్లు పెంచాల్సిందేనన్న ఫెడ్ రిజర్వ్.. మార్కెట్లు నెగెటివ్
US Interest Rates | సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తేల్చేశారు.
US Interest Rates | అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకోసం మున్ముందు వడ్డీరేట్లు పెంచక తప్పదని గురువారం ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి దిగి వచ్చే వరకూ వడ్డీరేట్లు పెంచక తప్పదన్నారు.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటన స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. ఎస్ అండ్ పీ 0.5 శాతంతో ముగిస్తే 10 ఏండ్ల గడువు గల యూఎస్ ట్రెజరీ బాండ్లు స్వల్ప పతనం తర్వాత 4.97 శాతం పుంజుకున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ ప్రారంభ నష్టాల నుంచి రికవరీ సాధించినా ముగింపు దశలో 0.17 శాతం నష్టంతో ముగిసింది. అక్టోబర్ 31, నవంబర్ ఒకటో తేదీన జరిగే యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

