US Passport | అగ్రరాజ్యం అమెరికాకు షాక్.. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి..!
US Passport | అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది.
US Passport | అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం, మలేషియాతో కలిసి యూఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక, ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి. అమెరికా ర్యాంక్ పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది. అలాగే, చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యూఎస్‌ను చేర్చలేదు.
మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి. తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి. ఈ విషయంలో యూకే కూడా ఏ మాత్రం భిన్నంగా లేదు. గతంలో టాప్‌లో ఉన్న బ్రిటన్, ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇంకా, హెన్లీ ఓపెన్నెస్ ఇండెక్స్ ప్రకారం, ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడి పోయింది. ఇప్పటి వరకు, అమెరికా పౌరులకు 180 దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా.. అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తోంది. అందువల్ల ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది. చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో చైనా తన పాస్‌పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరచుకుంది. చైనా ఇప్పుడు 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ, ఓపెన్నెస్ ఇండెక్స్‌లో 65వ స్థానంలో నిలిచి.. అమెరికాను అధిగమించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

