హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆప్టిమస్ ఫార్మాకు చెందిన మరో బ్రెక్స్పిప్రాజోల్ ట్యాబ్లెట్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒత్సుకా ఫార్మాకు చెందిన రెక్సూల్టి ట్యాబ్లెట్‌కు జనరిక్ వెర్షన్‌గా ఆప్టిమస్ తయారు చేసిన ట్యాబ్లెట్‌కు యూఎస్ నియంత్రణ మండలి అనుమతినిచ్చినట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఈ ట్యాబ్లెట్ 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ, 2 ఎంజీ, 3 ఎంజీ, 4 ఎంజీ రకాల్లో లభించనున్నది. ప్రస్తుతం ఈ రకం ట్యాబ్లెట్లు అమెరికాలో ఏటా 1,258 మిలియన్ డాలర్లమేర అమ్ముడవుతున్నాయి.