హైదరాబాద్, మే 1: కో-వర్కింగ్ సేవల సంస్థ అర్బన్వర్క్.. హైదరాబాద్లో తాజాగా మరో సెంటర్ను ప్రారంభించింది. హై-టెక్ సిటీలోని రహేజా మైండ్స్పేస్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 900 మంది కూర్చోవడానికి వీలుంటుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో డిజైన్ చేసిన ఈ సెంటర్లో 50 నుంచి 500 లోపు ఉద్యోగ సామర్థ్యం కలిగిన సంస్థలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది.