బెంగళూరు, అక్టోబర్ 29 : దేశంలో అతిపెద్ద ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. కొనుగోలుదారులకు దీపావళి ధమాకాను అందించింది. తన బాస్ ఆఫర్లలో భాగంగా ఎస్1 స్కూటర్‌పై రూ.25 వేల వరకు డిస్కౌంట్‌తోపాటు రూ.30 వేల వరకు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. దీంట్లో ఫైనాన్స్ ఆఫర్లు, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్, చార్జింగ్ క్రెడిట్స్‌తో పాటు ఇంకా ఇతరవి ఉన్నాయి. 72 గంటల పాటు అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నది. బాస్ ప్రచారంలో భాగంగా ఓలా ఎస్1 స్కూటర్ రూ.74,999 ప్రారంభ ధరకే అందిస్తున్నది. దీంతోపాటు రూ.25 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్న సంస్థ మరో రూ.30 వేల ప్రయోజనాలు అందిస్తున్నది. అలాగే రూ.7 వేల విలువైన ఎనిమిదేండ్లు లేదా 80 వేల కిలోమీటర్లు వ్యారెంటీ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.5 వేల వరకు ఫైనాన్స్ ఆఫర్లు, రూ.6 వేల విలువైన ఉచితంగా మూవీఓఎస్+, రూ.7 వేల విలువైన చార్జింగ్ క్రెడిట్, ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో రూ.5 వేలు ఇస్తున్నది. ప్రీమియం ఆఫర్లలో భాగంగా రూ.1,14,999కే ఎస్1 ప్రొ, రూ.1,07,499కే ఎస్1 ఎయిర్‌లను విక్రయిస్తున్నది.