న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో 1,699 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లుగా ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఒక నెలలో ఇంతటి స్థాయిలో లావాదేవీలు జరగడం ఇదే తొలిసారని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,31,00 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.200 లక్షల కోట్లకు పైగా ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో 80 యూపీఐ యాప్స్, 641 బ్యాంకులు యూపీఐ ఎకోసిస్టాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని తెలిపింది.