Bajaj Pulsar N150& N160 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన పాపులర్ మోటారు సైకిళ్లు.. బజాజ్ పల్సర్ ఎన్150, బజాజ్ పల్సర్ ఎన్160 2024 అప్ డేటెడ్ వర్షన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు బైక్‌లు రెండు వేరియంట్లలో లభిస్తాయి. బజాజ్ పల్సర్ ఎన్150 బైక్ రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్), బజాజ్ పల్సర్ ఎన్160 బైక్ రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
అప్డేటెడ్ బజాజ్ ఎన్ 150, బజాజ్ ఎన్160 మోటారు సైకిళ్ల టాప్ వేరియంట్లలో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది రియల్ టైం ఫ్యుయల్ ఎఫిషియెన్సీ, సగటు మైలేజీని తెలియజేస్తుంది. దీంతోపాటు బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూ కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు తేలిగ్గా ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లను మేనేజ్ చేయడానికి వీలు కలుగుతుంది.
ఇప్పుడు బజాజ్ ఎన్150 బైక్ సింగిల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు రేర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. రెండు మోటారు సైకిళ్ల డిజైన్, డైమెన్షన్, పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. సగటున బజాజ్ ఎన్150, బజాజ్ ఎన్160 మోటారు సైకిళ్లు లీటర్ పెట్రోల్ మీద 45-50 కి.మీ మైలేజీ ఇస్తాయి. భారత్ మార్కెట్లో హోండా యూనికార్న్, హీరో ఎక్స్ ట్రీమ్ 160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మోటారు సైకిళ్లకు ఈ మోటారు సైకిళ్లు పోటీ ఇస్తాయి.
ఇక బజాజ్ ఎన్150 బైక్ బేస్ వేరియంట్ రూ.1.18 లక్షలు, టాప్ వేరియంట్ రూ.1.24 లక్షలు, బజాజ్ ఎన్160 బైక్ బేస్ వేరియంట్ రూ.1.31 లక్షలు, టాప్ వేరియంట్ రూ.1.33 లక్షలు పలుకుతున్నాయి. బజాజ్ న్యూ పల్సర్ ఎన్150 బైక్ 149.68 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 14.3 హెచ్‌పీ, 13.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తున్నది. బజాజ్ ఎన్160 బైక్ 165 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 17 హెచ్‌పీ విద్యుత్, 14.3 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో ఇంజిన్ రూపుదిద్దుకున్నది.
రైడర్లకు కంఫర్టబుల్ రైడింగ్ కోసం బజాజ్ ఎన్150, బజాజ్ ఎన్160 మోటారు సైకిళ్లు ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనోషాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. పల్సర్ ఎన్150 బైక్ ఫ్రంట్‌లో సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ లో 130 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. పల్సర్ ఎన్160 ఫ్రంట్ లో 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్, రేర్ లో 230 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.