Top upcoming Bikes | ఈ ఏడాది చివరి నెల డిసెంబర్లో పలు బైక్‌లు భారత్‌లో, మరికొన్ని గ్లోబల్ మార్కెట్లలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ నెలలో స్పోర్టీ, రేసింగ్ బైక్‌లతో పాటు రెండు ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్స్ మార్కెట్లో తిరిగి తమదైన ముద్ర వేయనున్నాయి. క్లాసిక్ లెజెండ్స్‌కు చెందిన జావా బైక్స్ కూడా రీఎంట్రీ ఇస్తున్నాయి.
హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్
ఇండియా బైక్ వీక్ సందర్భంగా భారత్‌లో హెచ్డీ స్పోర్ట్‌స్టర్ ఎస్ ధర మరో రెండ్రోజుల్లో వెల్లడికానుంది. ఈ బైక్ రివల్యౌషన్ మ్యాక్స్ 1252సీసీ వీ-ట్విన్ ఇంజన్‌తో పాటు పాన్ అమెరికా 1250ని కలిగిఉంటుంది. హెచ్డీ స్పోర్ట్‌స్టర్ ఎస్ రెండవ మోస్ట్ పవర్ఫుల్ హెచ్-డీ మోటార్‌సైకిల్‌గా ముందుకురానుంది.
కేటీఎం ఆర్సీ 390
న్యూ జనరేషన్ కేటీఎం ఆర్సీ 390 త్వరలో గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనుంది. కేటీఎం ఆర్సీ 390 ఇండియా లాంఛ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. కేటీఎం మోటోజీపీ రేస్ బైక్ ఇన్స్పిరేషన్తో న్యూ కేటీఎం బైక్‌ను డిజైన్ చేశారు. ఈ బైక్ భారీగా కనిపించడంతో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్, లీన్ యాంగిల్ సెన్సిటివ్ కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది.
యజ్డీ రోడ్కింగ్
ఈ ఏడాది యజ్డీ తిరిగి గ్రాండ్ రీంట్రీ ఇవ్వనుంది. ఈ బ్రాండ్ నుంచి యజ్డీ రోడ్కింగ్ పేరుతో అడ్వంచర్ బైక్ లాంఛ్ కానుంది. రాబోయే యజ్డీ బైక్ రోడ్కింగ్ రౌండ్ హెడ్‌ల్యాంప్, విండ్‌స్క్రీన్, డ్యూయల్ పర్పస్ టైర్స్‌తో వైర్-స్పోక్ వీల్స్‌తో ముందుకు రానుంది. జావా పెరక్ ఇంజన్‌తో యజ్డీ అడ్వంచర్ బైక్ రానుందని అంచనా.
ఆల్ న్యూ బీఎస్ఏ బైక్
మరో క్లాసిక్ లెజెండ్స్‌కు చెందిన బ్రాండ్ డిసెంబర్ 4న ఆల్ న్యూ బీఎస్ఏ బైక్ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వనుంది. బ్రిటన్‌లో లాంఛ్ కానున్న బీఎస్ఏ బైక్ అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.