హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): బొగ్గురంగంలో సంస్కరణలు తీసుకొని రాబోతున్నామని, కార్మికులు అంకితభావంతో పనిచేస్తే తప్ప ప్రభుత్వరంగ సంస్థలను ఎవరూ రక్షించలేరని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చిందని చెప్పారు.
శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, కొత్త బ్లాకుల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.