హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : జాతీయంగా ఇప్పటి వరకు 143 మైనింగ్ ప్రాజెక్ట్‌లను మూసివేసినట్టు కేంద్రబొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రకటించారు. మైనింగ్ పూర్తయిన అనంతరం డీకోల్ అయ్యాయని, ఈ మైన్స్ అన్నింటిలోనూ గనుల మూసివేత తర్వాత అభివృద్ధిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాబోయే మూడేండ్లల్లో మైన్‌క్లోజర్ యాక్టివిటీస్ చేపడతామని పేర్కొన్నారు.
అరుదైన భూ మూలకాల ఉత్పత్తి రంగంలో ప్రవేశించేందుకు సింగరేణి సంస్థ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్(ఎన్ఎఫ్టీడీసీ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది.