ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్లలోపు టర్మ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.70 శాతం లోపు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. కానీ, ప్రత్యేక డిపాజిట్లపై మాత్రం అధిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. 800 రోజులు, 3 ఏండ్ల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై కూడా వడ్డీరేటును 7.30 శాతానికి సవరించింది. అలాగే రూ.5 కోట్ల లోపు డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అర శాతం వడ్డీని ఎక్కువ చెల్లించనున్నది బ్యాంక్.