ముంబై, ఆగస్టు 27: డిపాజిట్లను ఆకట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రూ. 5 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్ స్కీంలో భాగంగా సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు అర శాతం, 75 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని చెల్లించనున్నట్లు ప్రకటించింది. సహజంగా బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కంటే ఇది అదనమని పేర్కొంది.