హైదరాబాద్, అక్టోబర్ 9: బొల్లితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి శుభవార్తను అందించింది ఉనిజా హెల్త్‌కేర్ సంస్థ. బొల్లి చిక్సితకోసం విటెల్లస్ లోషన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కెనడాకు చెందిన లుకాస్ మేయర్ కాస్మోటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఈ లోషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మందులతో పోలిస్తే విటెల్లస్ అధునాతన పరిష్కారం చూపనున్నదని కంపెనీ సీఈవో, మేనేజింగ్ పార్టనర్ శ్రీకాంత్ శేషాద్రి తెలిపారు. దేశీయ మార్కెట్లోకి మరిన్ని నూతన మందులను విడుదల చేసేయోచనలో సంస్థ ఉన్నది. మరోవైపు కాది ప్లాంట్‌కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి జీఎంపీ సర్టిఫికేషన్ పొందింది.