హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహ న మోటార్‌సైకిళ్ల తయా రీ సంస్థ అల్ట్రావయలెట్… తాజాగా రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తన తొలి షోరూంను గురువారం ప్రారంభించింది. దీంతో సంస్థకు ఇది ఐదో షోరూం కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ నారాయణ్ సుబ్రమణియమ్ మాట్లాడుతూ.. వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టినట్లు, ఈ ఏడాది చివరినాటికి మొత్తం అవుట్లెట్ల సంఖ్యను పదికి పెంచుకోబోతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో అధిక మైలేజీని కోరుకుంటున్నవారిని దృష్టిలో పెట్టుకొని తొలి మాడల్ ఎఫ్77ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 320 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నదన్నారు. దీం ట్లో 7.1 కిలోవాట్లా బ్యాటరీ కలిగిన మాడల్ ధర రూ.2.99 లక్షలుగాను. 10.1 కిలోవాట్లా బ్యాటరీ మాడల్ రూ.3.99 లక్షలుగా నిర్ణయించింది.
మరోవైపు, శుక్రవారం సంస్థ గంటకు 265 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఎఫ్99ని స్పోర్ట్స్ బైకును ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. వచ్చే 2-3మూడేండ్లలో మరో 3-4 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన… ఈ బైకులపై ఎనిమిదేండ్లు లేదా 8 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది.