కోల్‌కతా, జూలై 17: అల్ట్రా-షార్ట్-టర్మ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరుగుతుండటంపట్ల క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల భారతీయ క్యాపిటల్ మార్కెట్స్పై చెడు ప్రభావం పడవచ్చన్నది.
‘ఈక్విటీ డెరివేటివ్ వాల్యూమ్స్, ముఖ్యంగా ఎక్స్పైరీ-డే ఇండెక్స్ ఆప్షన్స్‌పై చాలా స్వల్పకాలిక డెరివేటివ్స్ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ పరిస్థితులు తీవ్ర నష్టాలను కలిగించవచ్చు’ అని ఇక్కడ సీఐఐ చేపట్టిన 11వ క్యాపిటల్ మార్కెట్స్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ సెబీ శాశ్వతకాల సభ్యుడు అనంత్ నారాయణ్ అన్నారు. అందుకే ఈ ట్రేడింగ్‌ను అదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు.