న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.620 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.603 కోట్ల లాభంతో పోలిస్తే 2.82 శాతం వృద్ధిని కనబరిచినట్టు బ్యాంక్ వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.23 శాతం ఎగబాకి రూ.5.36 లక్షల కోట్లకు చేరుకున్నది. బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌లు రూ.2.31 లక్షల కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు రూ.3.06 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 62 బేసిస్ పాయింట్లు తగ్గి 2.56 శాతానికి పరిమితమయ్యాయి. ప్రస్తుతం బ్యాంక్ దేశవ్యాప్తంగా 3,322 శాఖలను నిర్వహిస్తుండగా, హాంకాంగ్-సింగపూర్లలో రెండు బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది.