UBS-Credit Suisse | క్రెడిట్ సూయిజ్’ యూబీఎస్ టేకోవర్‌తో సంక్షోభానికి తెర పడినట్లేనా?!
UBS-Credit Suisse | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును 320 కోట్ల డాలర్లకు యూబీఎస్ ఏజీ టేకోవర్ చేయనున్నది. ఇందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ 108 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం అందజేస్తుంది.
UBS-Credit Suisse | ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్న స్విట్జర్లాండ్ బ్యాంక్ ‘క్రెడిట్ సూయిజ్’ను టేకోవర్ చేయడానికి ఆ దేశంలోని మరో బ్యాంక్ ‘యూబీఎస్ ఏజీ’ సై అంది. 320 కోట్ల డాలర్లకు క్రెడిట్ సూయిజ్‌ను యూబీఎస్ కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరింది. దీంతోనైనా అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో తలెత్తుతున్న సంక్షోభాలకు తెర పడుతుందా? లేదా? అన్నది మున్ముందు చూడాల్సిందే.
300 కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌తో యూబీఎస్ కొనుగోలు
క్రెడిట్ సూయిజ్ షేర్లను 300 కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌తో యూబీఎస్ కొనుగోలు చేస్తుంది. ఇందుకు యూబీఎస్‌కు 108 బిలియన్ డాలర్ల క్రెడిట్‌ను స్విస్ నేషనల్ బ్యాంక్ కల్పిస్తుంది. ఇక క్రెడిట్ సూయిజ్ ఆస్తులతో సంభవించే నష్టాలకు స్విస్ సర్కార్ 900 కోట్ల స్విస్ ఫ్రాంక్‌ల గ్రాంట్‌తో పూచీకత్తు కల్పించింది. ఇక 16 బిలియన్ ఫ్రాంక్‌ల విలువ గల క్రెడిట్ సూయిజ్ బాండ్లు విలువ పూర్తిగా కోల్పోతాయి. ఇక క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ విభాగాన్ని క్రమంగా యూబీఎస్ కుదించనున్నది.
166 ఏండ్ల చరిత్ర గల క్రెడిట్ సూయిజ్ బ్యాంక్.. ఒకనాడు స్విట్జర్లాండ్ కీర్తి ప్రతిష్టలకు మారుపేరుగా నిలిచింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ పతనావస్థకు చేరుకుంటున్నదన్న వార్తలు వచ్చాయి. 1856లో ఏర్పాటైన క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం పట్ల అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది.

ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలిలా
క్రెడిట్ సూయిజ్ బ్యాంకులో సంక్షోభం కేవలం దేశీయ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని సర్కార్ గుర్తించింది. అందుకే స్విట్జర్లాండ్ సర్కార్, ఆ దేశంలోని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. క్రెడిట్ సూయిజ్‌ను కాపాడేందుకు రంగంలోకి దిగి యూబీఎస్ ఏజీ బ్యాంక్ యాజమాన్యంతో చర్చలు జరిపి రెండు బ్యాంకుల ఒప్పందం కుదిరేందుకు కృషి చేశాయి.
1856లో ఇలా క్రెడిట్ సూయిజ్ స్థాపన
స్విట్జర్లాండ్ రైల్ నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చేందుకు 1856లో పురుడు పోసుకున్న క్రెడిట్ సూయిజ్.. ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదుగుతూ దేశీయ ఆర్థిక రంగానికి కీలకంగా మారింది. ఒకానొక దశలో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ చేజ్తోనూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది.
కొన్ని దశాబ్దాలుగా క్రెడిట్ సూయిజ్ బ్యాంకులో వెలుగు చూసిన స్కామ్‌లు.. ఆ స్కామ్‌లతోపాటు సమస్యల నుంచి గట్టెక్కించేందుకు చేపట్టిన సంస్కరణ పలాల్ని నిర్వహణ లోపాలు నీరు గార్చాయి. ఫలితంగా పలు వివాదాలతో క్రెడిట్ సూయిజ్ అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుండటంతో దాని ప్రతిష్ట మసక బారిపోవడమే కాక ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బ తిన్నది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకుతో షురూ..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) పతనంతో అందరి కండ్లూ క్రెడిట్ సూయిజ్పై పడ్డాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులను నిశితంగా పరిశీలిస్తున్న సౌదీ నేషనల్ బ్యాంక్. ఇక నిధులు సమకూర్చబోమని చేసిన ప్రకటనతో క్రెడిట్ సూయిజ్ షేర్ల పతనం పెరిగిపోయింది. దీన్ని అడ్డుకునేందుకు స్విస్ కేంద్రీయ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల మేరకు ప్రకటించిన ఆర్థిక సాయం ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో సర్కార్ రంగంలోకి దిగింది.
ప్రపంచంలోనే 30 కీలక బ్యాంకుల్లో క్రెడిట్ సూయిజ్ ఒకటిగా నిలిచింది. కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో ఆర్థిక వ్యవస్థలో మొదలైన గందరగోళ పరిస్థితులకు ఇది సాక్షీభూతంగా నిలుస్తుంది. ఇంతకుముందు తీసుకున్న కఠిన నిర్ణయాల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వ జోక్యంతో ఉన్నపళంగా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలకుండా నివారించగలిగారని చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే 2008 ఆర్థిక మాంద్యానికి ముందు క్రెడిట్ సూయిజ్ ఆస్తుల విలువ ఒక లక్ష కోట్ల డాలర్లు. కానీ ఇప్పుడవి 580 బిలియన్ డాలర్లకే పరిమితం. ఎటువంటి బెయిలవుట్ లేకుండానే 2008 మాంద్యం వేళ మనుగడ సాగించిన క్రెడిట్ సూయిజ్.. ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకోవడం స్విస్ సర్కార్ ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

